హైదరాబాద్ బీఆర్ఎస్ రాజకీయాల కోసం కాకుండా.. ఓ లక్ష్యం కోసం పుట్టిన పార్టీ అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పునరుద్ఘాటించారు. యాదాద్రి భువనగిరికి చెందిన డీసీసీ అధ్యక్షుడు అనిల్కుమార్రెడ్డితో పాటు పలువురు సర్పంచులు, నేతలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నేతలకు సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ రాజకీయం కోసం కాదు.. ఒక లక్ష్యం కోసం పుట్టిన పార్టీ అని తెలిపారు. తెలంగాణ సాధనే ధ్యేయంగా ఉద్భవించిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. గతంలో ఎంతోమంది చాలా పెద్దలు ఉద్యమంలో పని చేశారని, ఎందరో త్యాగాలు చేశారన్నారు. ఆ తర్వాత ఉద్యమం నీరుగారిపోయినా.. మళ్లీ స్టార్ట్ చేసి కొట్లాడామని, ఇదంతా కండ్ల ముందు జరిగిన చరిత్ర అన్నారు
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీఎం శ్రీ కేసీఆర్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. pic.twitter.com/hrePJfnjAR
— BRS Party (@BRSparty) July 24, 2023