ప్రభన్యూస్, ప్రతినిధి / యాదాద్రి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతోజిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరపని ఉంటే తప్ప ప్రజలెవరూ తమ ఇళ్ల నుండి బయటికి రావద్దని జిల్లా కలెక్టర్ పమేలా సత్పథి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం మాట్లాడుతూ పాతబడిన ఇళ్లలో, శిథిలావస్థకు చేరిన ఇళ్ళలో, నీటికి బాగా నానిన ఇళ్ళల్లో ఉండరాదని, దగ్గరలో ఉన్న కమ్యూనిటీ హాల్, గ్రామ పంచాయతీ భవనం, పాఠశాలల్లో ఉండాలని కోరారు
అధికారులందరూ ఎలాంటి నష్టం జరగకుండా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, శిథిలావస్థలో ఉన్న గృహాలను గుర్తించి అందులో ఉన్న నివాసితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని ఆదేశించారు.