యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ ఇవాళ ధర్నాకు దిగుతారనే సమాచారంతో ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌజ్ అరెస్టు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నేతలు బూడిద భిక్షమయ్య గౌడ్, క్యామ మల్లేష్‌ను హౌజ్ అరెస్టు చేశారు.
జిల్లాలో అన్ని మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. జిల్లా పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడులను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు అక్రమ అరెస్టులకు తెర తీశారు. అరెస్టులకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రౌడీలు, టెర్రరిస్టులను అరెస్టు చేసినట్లు తమపట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎట్టి పరిస్థితుల్లో జిల్లా కేంద్రంలో జరిగే ధర్నా కార్యక్రమం విజయవంతం చేస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు. ఆలేరులో మున్సిపల్ చైర్మన్ శంకరయ్యను హౌస్ అరెస్టు చేశారు