యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ ఎన్‌ఎస్‌యూఐ చెందిన నేతలు, కార్యకర్తలు దాడి చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణా రెడ్డి శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూ నాయకులు గుంపుగా వచ్చి పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలపై సైతం దాడికి యత్నించారు.
కాంగ్రెస్ కార్యకర్తల దాడిని బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. రేవంత్ చేతగాని పాలనపై విమర్శలను తట్టుకోలేకనే కాంగ్రెస్ నాయకులు దాడికి తెగబడ్డారని తెలిపింది. పాలన చేతగాక, మీ అసమర్థతపై ప్రశ్నిస్తే దాడులకు తెగబడతారా అని మండిపడింది.
కాగా, ఈ దాడికి పాల్పడిన వారిలో కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు.