మాస్తంభోద్భవుడు లక్ష్మీనరసింహ స్వామి కొలువైన యాదగిరి గుట్ట పుణ్య క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైనది. పునర్నిర్మాణం తర్వాత ఇల వైకుంఠంగా విరాజిల్లుతున్న ఆలయంలో తొలి వార్షికోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21 నుంచి మార్చి 3 వరకు 11 రోజులపాటు సాగే వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం విష్వక్సేనారాధన, స్వస్తివాచనం, రక్షాబంధనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. 27న ఎదుర్కోలు, 28న సాయంత్రం తిరు కల్యాణోత్సవం నిర్వహించ నున్నారు. స్వామివారి కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులతోపాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు..
11 రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించే యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు నేడు ప్రారంభం కానున్నాయి. మంగళవారం ఉదయం 10 గంటలకు విష్వక్సేనారాధన, స్వస్తివాచనం, రక్షాబంధనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు సకల ఏర్పాట్లు చేశారు. విద్యుద్దీపాలంకరణ, రంగురంగుల పూలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అలంకార సేవలకు సర్వం సిద్ధం చేశారు