Friday, November 22, 2024

యాస్ తుపాను: తెలంగాణకు వర్షసూచన..

బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుపాను తీవ్ర తుపానుగా మారింది. వాయవ్య, ఉత్తర దిశల నుంచి తక్కువ స్థాయి గాలులు తెలంగాణ మీదకు వస్తున్నాయి. అయితే, రాగల మూడు రోజుల పాటు యాస్ తుపాను ప్రభావం కారణంగా తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా తూర్పు, దక్షిణ తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

యాస్ తుపాను తూర్పు, మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతూ… పారాదీప్ కు ఆగ్నేయ దిశగా 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. మరో 12 గంటల్లో అత్యంత తీవ్ర తుపానుగా ఇది అవతరించనుంది. రేపు తెల్లవారుజామున పశ్చిమబెంగాల్, ఒడిశా తీర ప్రాంతాలైన చాంద్ బలి, ధర్మా పోర్ట్ ల మధ్య ఇది తీరాన్ని తాకనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement