హుజూరాబాద్ భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు వై కేటగిరీ భద్రత కల్పించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి.తనకు ప్రాణహాని ఉందని ఇటీవల మీడియా సమావేశంలో ఈటల వెల్లడించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో నిన్న మేడ్చల్ డీసీపీ సందీప్ రావు నిన్న ఈటలను కలిసి వివరాలు సేకరించారు. ప్రాణహానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్న డీసీపీ సందీప్.. డీజీపీకి సీల్డు కవర్‌లో నివేదిక సమర్పించారు.
ఈ నివేదిక ఆధారంగా ఈటలకు వై కేటగిరీ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఐదుగురు అంగరక్షకులు ఎప్పుడూ ఈటల రాజేందర్ వెంట ఉంటారు. మరో ఆరుగురు అంతర్గత భద్రతా సిబ్బందిలో షిఫ్ట్ కు ఇద్దరు చొప్పున.. మూడు షిఫ్టుల్లో విధుల్లో ఉంటారు