Friday, November 22, 2024

త‌ప్పుడు చలానా వేశాం, ద‌య‌చేసి క్ష‌మించండి.. ఫ్రెండ్లీ పోలీసింగ్​ అంటే ఇట్లుండాలే!

‘‘తెలంగాణ ట్రాఫిక్ పోలీసులంటేనే జనాలకు చిర్రెత్తుకొస్తుంది. అన్నీ ఉన్నా.. వాహనదారులతో స‌ఖ్యంగా వ్య‌వ‌హ‌రించ‌ర‌ని, చాలా క‌ఠినంగా ఉంటార‌ని ప్ర‌చారంలో ఉంది. అయినదానికి, కానిదానికి ఫొటోలు కొట్టి, ఫైన్లు వేస్తారని చాలామంది అస‌హ్యించుకుంటారు. కనీసం చివ‌రికి క్ష‌మాప‌ణ కూడా చెప్ప‌కుండా వెళ్తారని చీదరించుకుంటారు. ఇట్లాంటి ఘటనలు హైదరాబాద్​ సిటీలో అయితే మస్తు జరుగుతుంటాయి. జూబ్లీహిల్స్​ చెక్​పోస్టు దగ్గర అయితే.. దాదాపు నలుగురైదురు ట్రాఫిక్​ కానిస్టేబుళ్లు సాయంత్రం అయ్యిందంటే ఇక దండుకోవడానికి బైలెల్లినట్టు చేతిలో కెమెరా, ఓ ట్యాబ్​ పట్టుకుని.. వచ్చిన బండిని వచ్చినట్టు ఆపుతూ వాహనదారులను ఇరిటేట్​ చేస్తుంటారు’’ ఇవి సామాన్య జనం నుంచి వినిపించే మాటలు..

కానీ.. ఢిల్లీలో సీన్ కాస్త రివ‌ర్స్ అయ్యింది. కారు న‌డుపుతుండ‌గా ఓ య‌జ‌మాని హెల్మెట్ పెట్టుకోలేద‌ని ట్రాఫిక్ పోలీస్ ఫొటో తీశారు. జ‌రిమానా కూడా వేశారు. ఆ త‌ర్వాత ఆ త‌ప్పు తెలుసుకున్న స‌దురు ట్రాఫిక్ కానిస్టేబుల్​ ఆ కారు య‌జ‌మానికి క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఇలా అనుకోకుండా జ‌రిగింద‌ని, టెక్నికల్​ లోపం వల్లే ఇలా చేయాల్సి వచ్చిందని వివ‌ర‌ణ కూడా ఇచ్చారు. ‘‘కారు న‌డుపుతుండ‌గా హెల్మెట్ పెట్టుకోలేద‌ని జ‌రిమానా విధించాం. ఇది పొర‌పాటు. ఈ చ‌లాన్ త‌ప్పుగా జారీచేశారు. సాంకేతికత లోపంగానే ఇలా జ‌రిగింది. ఇప్పుడు దాన్ని స‌రిదిద్దాం. క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాం. అత్యాధునిక ప‌రిజ్ఞానంతో ఇలాంటి లోపాల‌ను అధిగ‌మించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాం’’ అని ట్విట్ట‌ర్ వేదిక‌గా ఢిల్లీ పోలీసులు ఈ ఇన్సిడెంట్​పై వివ‌ర‌ణ కూడా ఇచ్చారు. దీంతో ఫ్రెండ్లీ పోలీసింగ్​ అంటే ఇట్లుండాలే కానీ, ఇరిటేట్​ చేస్తూ.. దోపిడీకి వచ్చిన వారిలా వ్యవహరించొద్దని కొంతమంది వాహనదారులు కామెంట్స్​ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement