చెన్నూర్, ప్రభ న్యూస్: గౌడ సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఎన్నికల హామీలో బాగంగా గౌడ కులస్తులకు ఇచ్చిన హామీ మేరకు గోదావరి తీరంలో ఉన్న రేణుక ఎల్లమ్మ గుడి వరకు రూ.15 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంఖస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మున్సిపల్ చైర్ పర్సన్ అర్చన గిల్డా, నాయకులు మూల రాజిరెడ్డి, మైదం రవి, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.