రాష్ట్రంలోని అన్ని కుల సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, కోరుట్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సంజయ్ తెలియజేశారు. మంగళవారం నియోజకవర్గంలోని కుల సంఘాల భవన నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేస్తూ ప్రోసిడింగ్ కాపీలను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. అన్నివర్గాల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు.
రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, కేసీఆర్ కిట్టు, కల్యాణ లక్ష్మి లాంటి ఎన్నో పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. మెట్ పల్లి పట్టణంలోని రజక సంఘ భవన అభివృద్ధికి మూడు లక్షల రూపాయలు, కోర్ట్ ఏరియా వడ్డెర సంఘానికి రెండు లక్షల యాభై వేల రూపాయలు, గౌడ సంఘ నిర్మాణాభివృద్ధికి ఐదు లక్షలు, శివాజీ నగర్ మున్నూరు కాపు కమ్యూనిటీ హల్ అభివృద్ధి కోసం రూ.3 లక్షలు, సోన్నాయి సంఘ అభివృద్ధికి రూ.3లక్షలు, ముదిరాజ్ సంఘ అభివృద్ధికి రూ.3లక్షలు, అరుంధతి మాదిగ సంఘ భవన అభివృద్ధికి రూ.3లక్షలు, పోచమ్మ కమ్యూనిటీ హాల్ అభివృద్ధి కోసం రూ.3లక్షలు కేటాయించారు.
అలాగే బుడిగ జంగ సంఘ భవన అభివృద్ధికి రూ.3లక్షలు, ముదిరాజ్ సంఘ భవన అభివృద్ధికి రూ.3లక్షలు , పోచమ్మ కమ్యూనిటీ హాల్ కోసం రూ.3లక్షల ప్రోసిడింగ్ కాపీలను అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రణవేణి సుజాత-సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు, కౌన్సిలర్లు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.