Friday, January 24, 2025

HYD | నిర్మాణంలో ఉన్న భవన సెంట్రింగ్ కుప్పకూలి కార్మికుడు మృతి..

మేడిపల్లి, జనవరి 21(ఆంధ్రప్రభ) : సెంట్రింగ్ కుప్పకూలి కార్మికుడు మృతిచెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తోటి కార్మికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో బండి గార్డెన్ 20వ డివిజన్ లో నిర్మాణంలో ఉన్న షెటర్స్ లో సెంట్రింగ్ తీస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి వరంగల్ కి చెందిన రాజు (47) మృతిచెందాడు.

మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. రామంతపూర్ లో నివాసం ఉంటూ తోటి సెంట్రింగ్ కార్మికులతో పీర్జాదిగూడలో పనికి వచ్చాడు. ఈ రోజు సెంట్రింగ్ ఇప్పుతుండగా సెంట్రింగ్ కుప్పకూలి రాజుపై పడింది. తోటి కార్మికులు స్థానిక హాస్పిటల్ కు తరలించగా.. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement