మదర్ డెయిరీ చైర్మెన్ గా మధుసూదన్ రెడ్డి
ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : పాడి రైతుల సంక్షేమమే ధ్యేయంగా మదర్ డెయిరీ చైర్మెన్, డైరెక్టర్లు పని చేయాలని ఆర్ఎన్ బీ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం హయత్ నగర్ లోని మదర్ డెయిరీలోని నూతన చైర్మెన్ ఎన్నికలో పాల్గొని మాట్లాడారు. నూతన చైర్మెన్ గా ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన గుడిపాటి మధుసూదన్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పార్టీల కతీతంగా మదర్ డెయిరీని బాగుచేసుకోవాలన్నారు. రైతులకు ప్రభుత్వం అందించే రూ.4ల బోనస్ ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానన్నారు. నూతన చైర్మెన్ కు పుష్పగుచ్చాన్ని అందజేసి శాలువాతో సన్మానించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ విఫ్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, చైర్మెన్ శ్రీకర్ రెడ్డి, డైరెక్టర్ లు గొల్లపల్లి రాంరెడ్డి, కల్లేపల్లి శ్రీశైలం, పాండు, నరేందర్ రెడ్డి, జంగయ్య, నర్సింహా రెడ్డి, నర్సింహులు, మాజీ చైర్మెన్లు గుత్తా జితేందర్ రెడ్డి, గంగుల కృష్ణా రెడ్డి, ఆలేరు మార్కెట్ చైర్మెన్ చైతన్య రెడ్డి, నాయకులు మోత్కుపల్లి ప్రవీణ్, సిల్వేరు బాలరాజు, నామిల మహేందర్ గౌడ్, సురేందర్ రెడ్డి, శంకర్ నాయక్, రాజు, రాంజీ నాయక్, విఠల్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.