తెలంగాణలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 3,30,00,088. ఇందులో పురుష ఓటర్లు 1,64,10,227 మంది ఉన్నారు. మహిళా ఓటర్ల సంఖ్య 1,65,87,134. జెండర్ రేషియో 1,011గా నమోదైంది. అంటే ప్రతి వెయ్యిమంది పురుష ఓటర్లకు 1,011 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ట్రాన్స్జెండర్ల ఓట్ల సంఖ్య 2,727. ఈ వివరాలను ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్. విడుదల చేశారు.
85 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల ఓటర్లు 1,94,082 మంది ఉన్నారు. ఈ ఎన్నికల్లో వారందరూ ఇంట్లో నుంచే ఓటు వేసే అవకాశం ఉంది. 3,403 మంది ఎన్నారై, 5,26,340 మంది పీడబ్ల్యూడీ ఓటర్లు ఉన్నారు. 18 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఓటర్లు 8,67,717 మంది. ఇందులో పురుషులు- 4,82,688, మహిళలు- 3,84,932, ట్రాన్స్జెండర్లు- 97 మంది. ఈవీఎంలల్లో బ్యాలెటింగ్ యూనిట్లు- 57,048, కంట్రోలింగ్ యూనిట్లు 44,569, వీవీప్యాట్స్- 48,134 అవసరమౌతాయి.
తెలంగాణలో ఉన్న మొత్తం లోక్సభ స్థానాల సంఖ్య 17 కాగా.. ఇందులో జనరల్- 12, ఎస్సీ రిజర్వుడ్-3, ఎస్టీ రిజర్వుడ్-2. అత్యంత తక్కువ విస్తీర్ణం గల లోక్సభ నియోజకవర్గం హైదరాబాద్. అతిపెద్ద స్థానం.. ఆదిలాబాద్. ఓట్ల పరంగా చూసుకుంటే అతి తక్కువ ఓటర్లు ఉన్న లోక్సభ నియోజకవర్గం- మహబూబాబాద్. ఇక్కడ 14,23,319 మంది ఓటర్లు ఉన్నారు.
అతిపెద్ద స్థానం- మల్కాజ్గిరి.
ఇక్కడ ఏకంగా 31,49,416 మంది ఓటర్లు ఉన్నారు.2004లో తెలంగాణ వరకు నమోదైన పోలింగ్ శాతం 69.95గా నమోదైంది. 2009లో- 72.70 శాతంగా నమోదైంది. ఆ తరువాత క్రమంగా పోలింగ్ శాతం తగ్గుతూ వచ్చింది. 2014లో 68.77, 2019లో 62.72 శాతం మేర ఓట్లు పోల్ అయ్యాయి.