Thursday, November 21, 2024

న్యూడ్ కాల్స్ తో వేధింపులు.. అవమానంలో యువతి సూసైడ్

పెళ్లి చేసుకోబోయే యువతినే బ్లాక్ చేసి ఆమె చావుకు కారణం అయ్యాడో యువకుడు. కాబోయే భర్తే కదా అని నమ్మినందుకు నట్టేటా ముంచాడు. చివరకు యువతిని, ఆమె కుటుంబాన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ యువతి ఆత్మహత్యకు కారణమయ్యాడు. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్ పేట్ గ్రామానికి చెందిన కార్తీక్ అనే యువకుడు ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు. కార్తీక్ కు ఇటీవల పెండ్యాల గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. కాబోయే భర్త బుద్ది తెలియక అతనితో రోజూ ఫోన్ లో మాట్లాడేది. ఈ క్రమంలోనే న్యూడ్ గా తనతో మాట్లాడాలని బలవంతం పెట్టేవాడు.

అయితే కాబోయే భర్తే కదా.. అని సదరు యువతి అతని కోరికతో న్యూడ్ గా వీడియో కాల్స్ చేసేది. అయితే, కార్తిక్ వీటిని ఆమెకు తెలియకుండా రికార్డ్ చేశాడు. ఇటీవలే ఇండియాకు వచ్చిన కార్తీక్ యువతికి తెలియకుండా సన్నిహితంగా ఉండే ఫోటోలను తీశాడు. ఫోటోలను, న్యూడ్ వీడియోలను అడ్డు పెట్టుకుని భారీగా కట్నం కావాలిని డిమాండ్ చేశాడు. అడిగినంత కట్నం ఇవ్వకుంటే ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో పెడతానంటూ బెదిరించాడు. కట్నం ఇవ్వలేకపోవడంతో ఇరు కుటుంబాలు వివాహం రద్దు చేసుకున్నాయి. దీంతో అవమానంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. యవతి మరణానికి కారణమైన కార్తిక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: నెల్లూరులో టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత

Advertisement

తాజా వార్తలు

Advertisement