Tuesday, December 3, 2024

ADB | కోతుల దాడిలో మహిళా మృతి..

ఖానాపూర్ టౌన్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం విద్యానగర్ కాలనీ చెందిన బొంగోని లక్ష్మి (58) తన ఇంటి ముందర గల రేకుల షెడ్డు కింద పడుకొని ఉండగా, ఒకసారి కోతులు పైకి రావడంతో ఆమె ఇంట్లోకి పరిగెత్తుతూ ప్రమాదవశాత్తు కాలుజారి సిమెంట్ గచ్చు పై పడడంతో ఆమె తలకు బలమైన గాయమైనది.

చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్ లు నిర్దర్శించారు. ఆమె భర్త గంగ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ‌ఖానాపూర్ ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement