ఆర్మూర్ టౌన్, మే 10( ప్రభ న్యూస్) : ఆర్మూర్ పట్టణంలోని శ్రీ తిరుమల హాస్పిటల్లో పిట్ల సుమలత(25) అనే బాలింత వైద్యురాలు శ్రీదేవి వడ్లమూడి వైద్యుల నిర్వాకం వల్ల ప్రాణాలను కోల్పోయింది. మృతురాలి భర్త సాయిలు కథనం ప్రకారం… ఐదు నెలల క్రితమే ఉపాధి కోసం గల్ఫ్ కంట్రీకి వెళ్లడం జరిగింది. మృతురాలికి రెండు కాన్పు లు నార్మల్ డెలివరీలో జరగగా.. మూడవ కాన్పు కోసం శ్రీ తిరుమల హాస్పిటల్ లో చేరారు. వైద్యురాలు సుమలత ఆరోగ్యం బాగాలేదని నార్మల్ డెలివరీ కాకుండా సర్జరీ చేసి డెలివరీ చేయాలని చెప్పడంతో బంధువులు సరేనన్నారు.
సర్జరీ అనంతరం మగ బిడ్డకు జన్మనిచ్చింది. మగ బిడ్డ పిల్లల ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా బాధితురాలు కడుపులో మంటగా ఉందనడంతో వైద్యురాలు అనస్తీసియా డాక్టర్ ను కాదని తానే మత్తుమందు ఇవ్వడంతో హార్ట్ బీట్ పెరిగి గుండెపోటుతో చనిపోయిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మహిళ చనిపోయి 24 గంటలు అయినా ఆసుపత్రి వర్గాలు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితురాలికి న్యాయం చేయాలని, డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు బంధువులు రోడ్డుపై బైఠాయించి హాస్పిటల్ ముందు రాస్తారోకో చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సముదాయించారు.