ఆర్టీసీ బస్సులో ఓ మహిళ వీరంగం సృష్టించింది. హయత్‌నగర్ బస్ డిపో పరిధిలో ఓ మహిళ బస్సు కండక్టర్‌తో అనుచితంగా ప్రవర్తించింది. దాంతో ఆగకుండా నానా రభస చేసి అతడిపై బూతులు తిడుతూ చేయిచేసుకొని దాడికి పాల్పడింది. అనంతరం కాలుతో తన్నింది.
హయత్ నగర్ బస్సు డిపో పరిధిలో ఓ మహిళ టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు కండక్టర్‌తో అనుచితంగా ప్రవర్తించింది. బూతులు తిడుతూ.. చేయిచేసుకోవడంతో పాటు కాలుతో సైతం తన్నింది. బస్సులో ఉన్న తోటి మహిళా ప్రయాణికులు ఎంత వారించినా సదరు మహిళ పట్టించుకోకుండా కండక్టర్ పై దాడికి పాల్పడింది. అయినా ఒక మహిళ అనే గౌరవంతో సదరు కండక్టర్ సంయమనం పాటించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఈ ఘటనపై సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్లో..’హయత్‌నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఓ మహిళా ప్రయాణికురాలు నానా దుర్భషలాడుతూ దాడికి పాల్పడిన ఘటనను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.