Monday, November 25, 2024

ADB | ‘వి వాంట్ ఏక్ పోలీస్’ అంటూ రోడ్డెక్కిన పోలీసుల భార్యలు

మంచిర్యాల: ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని కోరుతూ 13వ బెటాలియన్ లో విధులు నిర్వహించే పోలీసుల భార్యలు శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఫ్లైఓవర్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… సీఎం రేవంత్ పోలీస్ కుటుంబం నుండే వచ్చి మా బాధ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తమ భర్తలు చేసేది పేరుకే పోలీస్ ఉద్యోగమని, వారి చేత నిత్యం మొక్కలకు నీరు పట్టడం, చెత్త చెదారం ఏరి వేయడం లాంటి కూలీ పనులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ మేల్కొని తమకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement