Friday, November 22, 2024

Witness – ఇదిగో అధారాలు రాహుల్ గాంధీజీ .. మా ఎంపిపై దాడి చేసింది మీ కార్య‌క‌ర్తే… ….కెటిఆర్

దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడిన గటాని రాజు ముమ్మాటికీ కాంగ్రెస్ కార్యకర్తేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో నిందితుడు గంటాని రాజు ఫేస్‌బుక్ ఖాతా బయోతోపాటు మరో ఫొటోను షేర్ చేశారు. అందులో ‘జై కాంగ్రెస్ మిరుదొడ్డి మండల్’ అని రాసి రాజు రాసుకున్నాడు. రాజు మెడలో కాంగ్రెస్ కండువా కూడా ఉంది. అందులో అతడికి 2,400 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ ఫొటోను షేర్ చేసిన కేటీఆర్.. ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేసింది కాంగ్రెస్ గూండాయేనని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి ఇంతకుమించి ఆధారాలు కావాలా? అని ప్రశ్నించారు.

నిల‌క‌డ‌గా కొత్త అరోగ్యం ..

రాజు దాడిలో తీవ్రంగా గాయపడిన ఎంపీ ప్రభాకర్ ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడిలో ఆయన చిన్నపేగులోని కొంతభాగం దెబ్బతినడంతో ఆపరేషన్ వైద్యులు దానిని తొలగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మ‌రో నాలుగు రోజుల పాటు ఐసియు ఉంచి చికిత్స అందిస్తామ‌ని వైద్యుల ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement