హైదరాబాద్, ఆంధ్రప్రభ: కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో ఉండే హాస్టళ్లకు సరైనా అనుమతులు లేకుండానే యథేచ్ఛగా నడుస్తున్నాయి. ఫైర్ సేఫ్టీ, శానిటేషన్, ఇంటర్ బోర్డు తదితర విభాగాల నుంచి అనుమతులు లేకుండానే దొడ్డిదారిన వాటిని నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఒక్కో సొసైటీకి ఒకే రెసిడెన్షియల్ అనుమతి మాత్రమే ఉంటుంది. కానీ ఒకదానికి అనుమతి తీసుకొని మిగిలినవాటిని దొడ్డిదారిన నడిస్తున్నారని విద్యార్థి సంఘాలు మండి పడుతున్నాయి. జూనియర్ కాలేజీల్లో ఎలాంటి అకా డమీ, హాస్టల్ నిర్వహణకు ఇంటర్మీడియట్ బోర్డు అను మతులు జారీ చేయలేదని పలు నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కానీ కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కాలే జీలు వీటిని యథేచ్ఛగా నడిపిస్తున్నాయి. దొడ్డి దారిన నడిపిస్తూ ప్రభుత్వ ఖజానాకు కోట్లల్లో గండి కొడుతు న్నాయి.
రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీలు మొత్తం 405 వరకు ఉంటే, 2021-22 విద్యా సంవత్స రంలో ఇంటర్ బోర్డు నుండి అనుబంధ గుర్తింపు పొందిన ప్రైవేట్ కాలేజీలు 1584 ఉన్నాయి. వీటిలోని సుమారు సగం వరకు ప్రైవేట్ కాలేజీల్లో అనుమతులు లేకుండానే హాస్టళ్లను, అకాడమీలను నడిపిస్తున్నట్లు సమాచారం. జూనియర్ కాలేజీలను నడుపుకునేందు కు మాత్రమే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు గతేడాది అనుమతులిచ్చింది. గతేడాదె కాదు గతం లోనూ ఎప్పుడూ కూడా హాస్టళ్లు, అకాడమీలను నడు పుకోమని ఇంటర్ బోర్డు అనుమతివ్వదని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. అయినా హాస్టళ్ల ఫీజులను వేలల్లో..కాలేజీ ఫీజులను లక్షల్లో వసూలు చేస్తూ ఫీజుల దోపిడీకు తెరలేపుతున్నారు. ఒక్కో విద్యార్థి నుండి కేవలం హాస్టల్ ఫీజే నెలకు కనీసం రూ.4000 నుంచి రూ.7000 వరకు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ కాలేజీల్లో ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు కలిపి రూ. లక్ష నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆరోపిస్తుంది. ఏసీ, సెమీ ఏసీ, నాన్ ఏసీ రూమ్‌ల పేరుతో దాదాపు రూ.6 వేల నుంచి రూ.12 వేల వరకు హాస్టల్ ఫీజులను వసూలు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ దోపిడీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రూరల్ ప్రాంతాల్లో ఉండే కాలేజీల్లోని కాలేజీలకు అనుబంధంగా పెద్దగా హాస్టళ్లు ఉండవు. అయితే జిల్లా కేంద్రాల్లో, అర్బన్ ప్రాంతాల్లో మాత్రం కొన్ని కాలేజీలు హాస్టళ్లను నిర్వహిస్తున్నాయి. అక్కడ రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నట్లు- తెలుస్తోంది.
కాలేజీల అనుమతులు, హాస్టళ్ల అనుమతులు
ఒక కాలేజీకి తీసుకుంటూ గుట్టుచప్పుడు కాకుండా మరికొన్ని బ్రాంచిలను నెలకొల్పుతున్నారు. ఓ కాలేజీకు అనుమతి ఇవ్వాలంటే ఆ కాలేజీలో సైన్స్ గ్రూపుతో పాటు- ఏదేని ఆర్ట్స్ గ్రూపును కూడా బోధించాల్సి ఉంటు-ందని అధ్యాపకులు చెబుతున్నారు. కానీ సీఈసీ, హెచ్‌ఈసీ లాంటి కోర్సులు లేకుండానే కేవలం ఎంపీసీ, బైపీసీ గ్రూపులతో పాటు- ఎంసెట్, జేఈఈ, నీట్ లాంటి పేర్లతో ప్రత్యేక క్లాసులను నిర్వహిస్తున్నారు. ఇలా అనుమతుల్లేకుండా హాస్టళ్లను, కోర్సులను, బ్రాంచిలను ఏర్పాటు- చేసుకుంటూ ప్రతి ఏడాది వేల కోట్లల్లో వ్యాపారం చేస్తున్నారు. దొడ్డి దారిన ప్రతి ఏటా రూ. 4 నుంచి 5వేల కోట్ల వ్యాపారం నడుస్తున్నట్లు అంచనా. ప్రైవేట్ కాలేజీలపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే కార్పొరేట్ కాలేజీలు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. హాస్టళ్లలో వసతులు మాత్రం విద్యార్థుల సంఖ్యకు సరిపడా కనిపించవు.
అనుమతుల్లేకుండా హాస్టళ్లు నిర్వహణ – టి.నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఒక్కో సొసైటీకి ఒకటే హాస్టల్‌కు అనుమతి ఉంటుంది. కానీ అధికారికంగా అనుమతి తీసుకునేది ఒక దానికైతే అనుమతులు లేకుండా నడిపేవి చాలానే ఉంటాయి. వేలల్లో ఫీజులు వసూలు చేసి హాస్టళ్లను యథేచ్చగా కొన్ని కార్పొరేట్ కాలేజీలు నడిపిస్తున్నా యి. అనుమతులు లేకుండా హాస్టళ్లను నడిపే అలాంటి కాలేజీల గుర్తింపును ఇంటర్ బోర్డు రద్దు చేయాలి.