Sunday, October 27, 2024

TS – వారం రోజుల్లోనే రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేస్తాం – రేవంత్ రెడ్డి

కొడంగల్. – వారం రోజుల్లోనే రూ.500కు గ్యాస్ సింలిండర్ అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో నాలుగు గ్యారెంటీలు అమలు చేసే దిశగా ముందుకెళ్తున్నామని తెలిపారు..

200 యూనిట్ల ఉచిత కరెంట్ త్వరలోనే ఇస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లోనే రైతు రుణమాఫీ కూడా చెపడాతామని తెలిపారు. రైతుభరోసాను పది రో జుల్లో అర్హులందరికి వేస్తామని చెప్పారు. కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. 27 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. వేల కోట్లు రూపాయలు కాంట్రక్టర్ల దగ్గర నుంచి కమిషన్లుగా తీసుకున్నారని చెప్పారు. పదేళ్లలో రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు.

ఎక్కడి నుంచో వలస వచ్చిన కేసీఆర్ ను ఎంపీ చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లు సీఎంగా ఉన్నా పాలమూరు ప్రాంతానికి కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్ క్షమాపణ చెప్పిన తర్వాతే మళ్లీ ఈ గడ్డపై అడుగు పెట్టాలన్నారు సీఎం రేవంత్. పాలమూరు ప్రజలు ఛీకొట్టినా కేసీఆర్ కు సిగ్గు రాలేదన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాకే తెలంగాణకు ఎక్కువ నష్టం జరిగిందన్నారు.

- Advertisement -

మహబూబ్‌నగర్‌ లోక్ సభ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డి

పార్లమెంట్‌ లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌ పార్టీ తొలి లోక్‌సభ అభ్యర్థిని ప్రకటించింది. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ సెగ్మెంట్‌కు కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డిని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కోస్గి సభలో పాల్గొన్న సీఎం తొలి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు.

మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తా….

మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తామని కోస్గి సభలో రేవంత్ రెడ్డి తెలిపారు. ఐకేపీ, మహిళా సంఘాల ద్వారా పంటలు కొనుగోళ్లు చేస్తామని స్పష్టం చేశారు.కుటుంబం ఆర్థికంగా బాగుపడాలంటే నగదు ఆడబిడ్డల చేతుల్లోనే ఉండాలి అని తెలిపారు. మగవారికి ఇస్తే సాయంత్రం బెల్ట్ షాపుల్లో ఖర్చు పెడతారు అని అన్నారు. భవిష్యత్తులో సున్నా వడ్డీ విధానాన్ని అమలు చేస్తాం. మిమ్మల్ని లక్షాధికారి కాదు.. కోటీశ్వరుల్ని చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం’ అని తెలిపారు.

ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కొడంగల్ లో పర్యటించిన రేవంత్ రెడ్డి….. కోస్గిలో రూ.4,369 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేపట్టారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు . అలాగే మెడికల్‌, నర్సింగ్‌, డిగ్రీ, ఇంటర్‌ కాలేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,జూపల్లి కృష్ణారావు,దామోదర రాజనర్సింహ, స్పీకర్ ప్రసాద్ కుమార్ అధికారులు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement