Friday, November 22, 2024

Delhi: క‌విత డిఫాల్ట్ బెయిల్ పిటిష‌న్ ఉప‌సంహ‌ర‌ణ‌..

కోర్టుకు విన్న‌వించిన క‌విత న్యాయ‌వాదులు
బెయిల్ కు ప్ర‌త్యామ్నాయ మార్గాలపై దృష్టి

ఆంధ్రప్ర‌భ స్మార్ట్ – న్యూఢిల్లీ : మద్యం కుంభకోణం కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ కేసుకు సంబంధించి రౌస్‌ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన డీఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్‌ను ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకున్నారు. కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం తుది విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

కానీ, తాజాగా పిటిషన్‌ ఉపంహరించుకుంటున్నట్లు కవిత తరఫున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. చట్ట ప్రకారం ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నందున పిటిషన్‌ ఉపసంహరించుకుంటున్నట్లు వివరించారు.

సీబీఐ ఛార్జిషీట్‌లో తప్పులున్నాయని పేర్కొంటూ, జులై 6న కవిత డీఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, ఎలాంటి తప్పులు లేవని సీబీఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు జులై 22న ప్రత్యేక కోర్టు ప్రకటించింది. ఈనెల 9న దీనిపై విచారణ జరపనుంది. అయ‌తే ఈ పిటిష‌న్ ను ఉప‌స‌హ‌రించుకోవ‌డంతో ఇక విచార‌ణ క్లోజ్ చేసే అవ‌కాశాలున్నాయి..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement