కరీంనగర్ జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా జిల్లా ఎన్నికల అధికారితో, ఇతర శాఖల సమన్వయంతో కలిసి పని చేస్తున్నామని పోలీస్ కమిషనర్ ఎల్. సుబ్బారాయుడు అన్నారు. తద్వారా జిల్లాలోని ప్రతి పౌరుడు స్వేచ్ఛగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కల్పిస్తామన్నారు.
కరీంనగర్ జిల్లాలో మొత్తం 1338 పోలింగ్ స్టేషనులు, అందులో 1048 సాధారణ, 290 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నట్టు చెప్పారు. కాగా, జిల్లాలో ఇప్పటివరకు 36 కేసుల్లో 128 మందిని బైండోవర్ చేసినట్టు చెప్పారు. గతంలో ఎలక్ట్రోరల్ నేరాలకు పాల్పడ్డ వ్యక్తులను, అందులో సహకరించిన వ్యక్తులను బైండోవర్ చేసినట్టు తెలిపారు. రౌడీ షీట్ కలిగిన వారిని కూడా ముందస్తుగా బైండోవర్ చేసినట్టు సీపీ వెల్లడించారు.