Saturday, November 23, 2024

Wishes – స్వచ్ఛ సర్వేక్షన్ లో రుద్రూర్ గ్రామపంచాయతీ ఎంపిక…

నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ గ్రామపంచాయతీ స్వచ్ఛ సర్వేక్షన్ లో నిజాంబాద్ జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైంది. గ్రామ సర్పంచ్ ఇందూర్ చంద్రశేఖర్ ను మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి , జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అభినందించారు. ఆదివారం నిజాంబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో సర్పంచ్ కు సన్మానం చేసి మెమొంటో, ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందించిన అధికారులకు గ్రామ ప్రజలకు గ్రామ సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీమతి జయసుధ, ప్రాజెక్ట్ డైరెక్టర్ చంద్ర నాయక్, ఏపీఓ అరుణ్, పంచాయతీ కార్యదర్శి గంగాధర్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement