ప్రభన్యూస్, ప్రతినిధి/యాదాద్రి తెలంగాణలో నిరుపేదల పక్షపాతిగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారని ప్రభుత్వ విప్ గింగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోటకొండూరు మండలంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 40 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ను ప్రారంభించి, లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పల్లా వెంకట్ రెడ్డి, ఎంపీపీ ఇందిర, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బోట్ల యాదయ్య, తాసిల్దార్ జ్యోతి, ఎంపీడీవో వీరస్వామి, ఆయా గ్రామాల సర్పంచులు వడ్డే బోయిన శ్రీలత, పన్నాల బాయమ్మ, బాల సిద్ధులు, ఎంపీటీసీ అంజిరెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు బురాన్, టిఆర్ఎస్ నాయకులు తదితరులున్నారు.