Friday, October 4, 2024

TG: వ‌ర‌ద బాధితుల‌కు విన్స్ బ‌యో ప్రొడ‌క్ట్స్ రూ.51ల‌క్ష‌ల విరాళం

హైద‌రాబాద్ – విన్స్ బయో ప్రొడక్ట్స్ సంస్థ తెలంగాణ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.51 లక్షల విరాళం అందించింది. ఆ సంస్థ చైర్మన్ శ్రీదాస్ నారాయణ దాస్ డాగ, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ డాగ శుక్రవారం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు.

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా విరాళం అందించినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు.

బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భారీ విరాళం

- Advertisement -

ముఖ్యమంత్రి సహాయ నిధి కి 1,01,75,000 (ఒక కోటి ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ) చెక్ ను సీఎం రేవంత్ రెడ్డి కి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ ప్రతినిధులు వి.సురేందర్, ఎస్.ఎన్ రెడ్డి లు అందజేశారు.

రూ. 10 లక్షల ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ విరాళం

ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం 10 లక్షల రూపాయల చెక్ ను సీఎం రేవంత్ రెడ్డి కి అందజేసిన ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఎండీ కె.వి సుబ్బయ్య,డైరెక్టర్ సోమలింగం గౌడ్

Advertisement

తాజా వార్తలు

Advertisement