Friday, November 22, 2024

Wines Closed : నేటి నుంచి తెలంగాణలో వైన్ షాపులు బంద్

తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ప్రచారానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండటంతో.. ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఎన్నికల ప్రచార పర్వం నేటి సాయంత్రం ఐదు గంటల నుంచి ముగుస్తుంది. అసెంబ్లీ ఎన్నికలు స‌మీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. నేటి సాయంత్రం 5గంటల నుంచి గురువారం (నవంబర్ 30) సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయనున్నారు.

ఈ విషయంపై వైన్స్‌, బార్ల యజమానులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ముందస్తు సమాచారం ఇచ్చింది. రాష్ట్రంలోని మద్యం దుకాణాల యజమానులను రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ అప్రమత్తం చేసింది. ఎన్నికలను సజావుగా నిర్వహించే క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను పాటించకపోతే.. లైసెన్స్‌లు రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల ఎన్నికల ఫలితాలు వెలువడనున్న డిసెంబర్‌ 3వ తేదీ కూడా మద్యం షాపులు మూసి ఉంటాయని అధికారులు తెలిపారు. ఇక డిసెంబర్‌ 1నుంచి నూతన మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement