తెలంగాణలో బీజేపీ 17ఎంపీ స్థానాల్లో విజయం సాధించి క్వీన్ స్వీప్ చేయడం ఖాయమని జేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యనించారు. ఈ సందర్బంగా సోమవారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ విజయ సంకల్ప యాత్ర కు ప్రజల నుండి అద్బుతమైన స్పందన లభిస్తోందన్నారు. ఇవి మోదీ ఎన్నికలు….ప్రజలు నరేంద్రమోదీని మళ్లీ ప్రధాని చేయాలని నిర్ణయించేశారని అన్నారు.
దేశవ్యాప్తంగా 370 ఎంపీ సీట్లు సాధించబోతున్నా మనిబధీమా వ్యక్తం చేశారు. మలిదశ యాత్ర హుస్నాబాద్, హుజూరాబాద్, మానకొండూరు, చొప్పదండి, కరీంనగర్ నియోజకవర్గాల్లో పూర్తి చేస్తామన్నారు. తొలిదశ యాత్రకు అపూర్వ స్పందన లభించిందని, కరీంనగర్ ఎంపీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవబోతున్నామని తెలిపారు. సీబీఐ, ఈడీని శాసించే అధికారం బీజేపీకి లేదని, అవి స్వతంత్య్ర విచారణ సంస్థలని పేర్కొన్నారు. సీబీఐ సేకరించిన ప్రాథమిక ఆధారాలు, సాక్షాల ఆధారంగా కవితకు నోటీసులిచ్చారని తెలిపారు. ఆధారాలుంటే ఎంత పెద్దవారైనా ఉపేక్షించ కూడదన్నదే బీజేపీ విధానం అన్నారు.కాంగ్రెస్, బీఆర్ఎస్‌వి చీకటి ఒప్పందాలని, పైకి మాత్రం ఆ రెండు పార్టీల నేతలు తిట్టుకుంటారని అన్నారు. కాంగ్రెస్ నేతలు అసత్యప్రచారాలు చేస్తున్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేసీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని అన్నారని, పోటీ చేశామా? దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలన్నారు.
కేంద్ర నాయకత్వం తెలంగాణ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఐదారు రోజులలో అభ్యర్థులను ప్రకటించబోతోందని బండి సంజయ్ తెలిపారు. గ్రామాలవారీగా ఏం అభివృద్ధి చేసింది.. కేంద్రం ఏ మేరకు నిధులు ఇచ్చింది.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు తదితర అంశాలతో ప్రజాహిత యాత్ర ప్రచారంలోకి వెళతామని, అలాగే నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానమంత్రి చేయాలన్న ఆలోచనతో యాత్ర కొనసాగిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.