రాష్ట్రంలో ఆగస్టు 15లోపు రుణమాఫీ చేయకపోతే రేంవత్ సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అంటే మోసం, నమ్మక ద్రోహమని ఫైర్ అయ్యారు.
ఇచ్చిన హమీ మేరకు ఇప్పటి వరకు రైతుబంధు కూడా పూర్తి చేయలేదంటూ ధ్వజమెత్తారు. అది పూర్తి కాకముందే కొత్తగా ఆగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ హమీ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమను ఎందుకు ఓడిస్తారంటూ రేంవత్ అడుగుతున్నారని.. కాంగ్రెస్‌ను ఓడగొట్టేందుకు వంద కారణాలున్నాయని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఓడించరా.. అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలిచ్చి… గత ఎన్నికల్లో గెలిచిందన్నారు. లోక్ సభ ఎన్నికల కోసం ఇప్పుడు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇస్తుందన్నారు.
- Advertisement -