కరోనా నిబంధనలు అధికార టీఆర్ ఎస్ పార్టీకి వర్తించవా… బీజేపీ కే వర్తిస్తాయా అని బీజేపీ నాయకురాలు విజయశాతం ప్రశ్నించారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈసందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ…. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని.. బీజేపీని అడ్డుకోవడానికి, ఉద్యమాలను అణచివేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మండి పడ్డారు. మమ్మల్ని చంపినా..4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం ఉద్యమం చేస్తామని విజయశాంతి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కేసీఆర్ చేయడని తెలిసినా.. ప్రజలు చనిపోతున్నారని.. ఆయనను గద్డె దించాలని ప్రజల్ని కోరారు.
బండి సంజయ్, కార్యకర్తలపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని, 317 జీవో సవరణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫామ్ హౌజులో కూర్చోని రాత్రికిరాత్రి జీవోలు తీసుకువస్తున్నారని, పోలీసులు కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. సంజయ్ ని లాక్కెళ్లడం, మహిళల చీరలు లాగేయడం, కార్యకర్తలపై లాఠీ ఛార్జీ చేయడం వంటి అరాచకాలకు పాల్పడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు అయ్యాయన్నారు. మేం దీక్షలకు పిలుపునిచ్చినప్పడే కాంగ్రెస్ చేత దీక్షలు పెట్టిస్తున్నారంటూ విమర్శించారు. కేసీఆర్ చేసిన పాపాలు కూడా త్వరలోనే ప్రజలకు తెలుస్తాయన్నారు. కేసీఆర్ ఓ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తాడని విజయశాంతి అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital