Friday, November 22, 2024

TS: నిమ్స్ అభివృద్ధికి మరింత కృషి చేస్తా : దామోదర్ రాజనర్సింహ

నిమ్స్ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌కు జాతీయస్థాయిలో బ్రాండ్ ఇమేజ్ ఉందనిపేర్కొన్నారు. శుక్రవారం నిమ్స్‌లో నూతనంగా నిర్మించిన డీఎస్ఏ, సీపీఆర్ ల్యాబ్‌లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో నిమ్స్‌కు బ్రాండ్ ఇమేజ్ ఉందన్నారు. నిమ్స్ బ్రాండ్ కొనసాగేలా తనవంతు సహకారం అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉస్మానియా, గాంధీ, కాకతీయ, ఆసుపత్రితో పాటు నిమ్స్ ఆస్పత్రి ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తూ రాష్ట్రాన్ని హెల్త్ డెస్టినేషన్‌గా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపును రావడానికి కృషి చేస్తున్నారన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో మెడికల్ టూరిజంతో పాటు హెల్త్ ఎడ్యుకేషన్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుకు కృషి చేస్తున్నామని తెలిపారు. వచ్చే 20 ఏండ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్య, వైద్య రంగాలు మరింత అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం నూతన కార్యాచరణను రూపొందిస్తున్నామని వెల్లడించారు. 39 మంది అసోసియేట్ ప్రొఫెసర్‌లు, 300 మంది స్టాప్ నర్సులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, మెడికల్ సూపరింటెండెంట్ డా. నిమ్మ సత్యనారాయణ, కార్డియాలజీ విభాగదిపతి సాయి సతీష్, యూెస్ఏఐడీ డా.వర ప్రసాద్, నిఖిల్ రెడ్డి, నిమ్స్ ఆస్పత్రి వివిధ విభాగాధిపతులు, డాక్టర్లు నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement