Tuesday, October 8, 2024

TG | వన్యప్రాణుల‌ను సంరక్షించుకోవాలి : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

జన్నారం, (ప్రభ న్యూస్) : వన్యప్రాణులను, అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంద‌ని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని అటవీ డివిజన్ కార్యాలయం సమీపంలో రూ.54 లక్షలతో నిర్మించిన అటవీశాఖ నూతన సెక్షన్, బిట్ ఆఫీసర్స్ క్వార్టర్లను సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు.

మండలంలోని కామనపల్లి,రోటిగూడ గ్రామాల్లో పల్లె దావఖాన నిర్మాణాలకు, కవ్వాల రామ్ నాయక్ తండ, పొనకల్, చింతగూడ, రోటిగూడ, తపాల్ పూర్ గ్రామాలలో సీసీరోడ్ల, మురికి నీటి కాలువల నిర్మాణం పనులను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పర్యావరణ సమతుల్యత ఉంటేనే వాతావరణంలో మార్పులు, చేర్పులు జరుగుతాయన్నారు. ప్రస్తుతం అడవులను నరకకూడదని, వన్యప్రాణులను హతమార్చకూడదని ఆయన తెలిపారు. మానవాళి మనుగడకు అడవులు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. వాతావరణ సమతూల్యత దెబ్బతినడం వల్లనే ప్రస్తుత చలికాలంలో చాలా ఉడుకపోస్తుందని ఆయన తెలిపారు. అడవుల్లోని రోడ్ల అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.

అడవులకు నష్టం కలిగించే ఆదివాసులతో ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, అవగాహన కల్పించాలని, అడవుల్లోని ఆదివాసులు చాలా అమాయకులని, వాళ్ళని హింసించకూడదని, నచ్చ చెప్పడం ద్వారానే పరిష్కార మార్గాలు లభిస్తాయని ఆయన తెలిపారు. వన్యప్రాణి సప్తహ కార్యక్రమాల సందర్భంగా గెలుపొందిన వారికి ఎమ్మెల్యే చేతుల మీదుగా మెమోటోలు అందజేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేకు రేంజర్ జ్ఞాపకం అందజేశారు.

ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రాజ మనోహర్ రెడ్డి ,ఎంపీడీఓ శశికళ, ఎంపీఓ జలంధర్ ,జన్నారం ఇన్చార్జి రేంజ్ ఆఫీసర్ వి.సుష్మారావు, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ తిరుపతి, సెక్షన్, బిట్ ఆఫీసర్లు ఎస్కె నహీద పర్వీన్, ఎస్.శ్రీనివాస్, రైమోద్దీన్, కాంగ్రెస్ పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement