వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్) : అగ్ని సాక్షిగా పెళ్ళాడిన భర్త పెట్టె వేధింపులు తాళలేక, కట్టుకున్నోడినే కడతేర్చిన నింధితురాలైన భార్య, మర్డర్ కు సహకరించిన బావమర్ధిలను హన్మకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు హన్మకొండ ఏసీపీ జితేందర్ రెడ్డి, ఇన్ స్పెక్టర్ వేణు మాధవ్ లు తెలిపారు. ఏసీపీ జితేందర్ రెడ్డి కథనం ప్రకారం… హన్మకొండ రెడ్డి కాలనీలో ఆదివారం రాత్రి తప్పతాగి వచ్చిన భర్త గన్నేర్ల శంకర్ (40) కళ్ళలో కారం చల్లి, అక్కడే ఉన్న ఇనుప రాడ్ తో తలపై బాధి, కొట్టి చంపారు.
రక్తపు మడుగులో విలవిలాడి చనిపోయిన శంకర్ మృతదేహం తీసుకెళ్లామని స్వయంగా నిందితురాలు గన్నేర్ల సుజాత, మృతుని సోదరుడికి ఫోన్ చేసి చెప్పడంతో కేసు మిస్టరీ వీడింది. పెళ్ళైన నాటి నుండి అయిదారేళ్లు సవ్యంగా, సాఫీగా సాగిన కాపురంలో ఇద్దరు పిల్లలు జన్మించారు. ఆటో డ్రైవర్ గా పని చేస్తూ మద్యం మత్తుకు బానిసైన గన్నేర్ల శంకర్, కూలి పనికిపోయి వచ్చిన భార్య సుజాతకు నిత్యం నరకం చూపించడంతో, ఆ భార్య అడ్డు తొలగించుకొంటే తప్ప ప్రశాంత జీవితం దొరకదనే ఈ దారుణ ఘటనకు ఒడిగట్టినట్లు నిందితురాలు పోలీసుల ఎదుట అంగీకరించింది. తన సోదరుడు జనుప వెంకట్ సహకారంతో భర్తను హతమార్చిన్నట్లు అంగీకరించడంతో గన్నేర్ల సుజాత, వెంకట్ లను అరెస్ట్ చేసినట్లు హన్మకొండ ఏసీపీ జితేందర్ రెడ్డి, హన్మకొండ ఇన్ స్పెక్టర్ వేణు మాధవ్ లు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..