ఉమ్మడి రంగారెడ్డి, ప్రభన్యూస్ : రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలనే నిబంధన గాలిలో దీపంలా మారింది.. 48గంటలు కాదు కదా 15 రోజులు అవుతున్న వారి ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదు.. అవసరాల నిమిత్తం ధాన్యం అమ్మగా సకాలంలో డబ్బులు వస్తాయని ఆశపడుతున్న రైతులకు నిరాశే ఎదురవుతోంది.. దాదాపుగా రెండు వారాలుగా డబ్బుల కోసం రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
యాసంగి సాగుకు డబ్బులు అక్కరకు వస్తాయనే నమ్మకంతో ధాన్యం అమ్మినా సకాలంలో డబ్బులు చేతికి రాకపోవడం రైతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. రైతుల కోసం వీధుల్లో పోరాటాలు చేస్తున్నా వారి సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి తప్పిస్తే ఏమాత్రం తగ్గడం లేదు..
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital