Tuesday, November 26, 2024

దేశ‌మంత‌టా చైనా బ‌జార్లు ఎందుకు ఉన్నాయ్.. కేసీఆర్

బిఆర్ ఎస్ చేస్తుంది రాజ‌కీయ పోరాటం కాద‌ని జీవ‌న్మ‌ర‌ణ పోరాట‌మ‌న్నారు సీఎం కేసీఆర్. మేక్ ఇన్ ఇండియా నినాదం జోక్ గా మారిందని ఏద్దేవా చేశారు కేసీఆర్. స్వాతంత్రం తరువాత 54 ఏళ్లు కాంగ్రెస్, 16 ఏళ్లు బిజెపి పాలించాయని.. ఈ రెండు పార్టీలు ఇప్పటివరకు ఏం సాధించాయని ప్రశ్నించారు. నువ్వు అంత తిన్నావంటే.. నువ్వు ఇంత తిన్నావని తిట్టుకుంటాయని కేసీఆర్ ఎద్దేవా చేశారు.మాంజాలు, పతంగులు, దైవ ప్రతిమలు, చివరకు జాతీయ జెండాలు కూడా చైనా నుంచే వస్తున్నాయన్నారు. దేశమంతటా చైనా బజార్లు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. నాందేడ్ లో ఎన్ని చైనా బజార్లు ఉన్నాయో లేక పెట్టారా? అని అక్కడి ప్రజలను ప్రశ్నించారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలో చాలా చైనా బజార్లు ఉన్నాయని తెలిపారు. దేశంలో సమృద్ధిగా వనరులు ఉన్నప్పటికీ ప్రజలు ఎన్నో ఏళ్లుగా వంచనకు గురవుతున్నారని తెలిపారు. భారత్ పేద దేశం కాదని… అమెరికా కంటే భారత్ ధనవంతమైన దేశం అన్నారు. మహారాష్ట్రలో ఇన్ని నదులు ఉన్నప్పటికీ నీటి కరువు ఎందుకు ఉందని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement