Friday, November 22, 2024

TS: భార్య, భర్తల ఆత్మహత్యలకు కారణం ఎవరు? .. డాక్టర్ మౌనిక ఎవరు ?

భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు/పినపాక: పినపాక మండలం, ఉప్పాక గ్రామానికి చెందిన కాలేవారు సాయికుమార్, భార్య కారం స్వప్న బుధవారం అత్తగారి ఇంట్లో ఉరి వేసుకొని మృతి చెందింది. భార్య మరణ భయంతో సాయికుమార్ మణుగూరులోని ఇసుక పాత బంకర వద్ద పురుగు మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు, వాహన దారులు గమనించి అపస్మారక స్థితిలో ఉన్న సాయి కుమార్ ను 108 ద్వారా మణుగూరు ఏరియా అసుపత్రికి వైద్యం కోసం తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు పరిస్థితి విషమించిందని, భద్రాచలం ఏరియా అసుపత్రికి తీసుకెళ్ళాలని కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు వెంటనే 108ద్వారా భద్రాచలం ఏరియా అసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సాయికుమార్ పరిస్థితి విషమంగా ఉంది.

  • సాయికుమార్ అర చేతిపై రాసిన పేరు ఏవరిది….?
    ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కాలేవారు సాయికుమార్ అరచేతి పై, నా చావుకు కారణం డాక్టర్ మౌనిక అని రాసి పెట్టాడు. అసలు ఎవరు ఈ డాక్టర్ మౌనిక ? ఎక్కడ ఈమెది..? అసలు సాయికుమార్ కు, డాక్టర్ మౌనిక కు సంబంధం ఏమిటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తారా, లేదో వేచి చూడాలి.

  • సాయికుమార్, డాక్టర్ మౌనిక మధ్య ఏమి జరిగింది…?
    సాయికుమార్, డాక్టర్ మౌనిక మధ్య ఉన్న సంబంధం ఏమిటి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన, సాయికుమార్ ఫోన్ లో డాక్టర్ మౌనిక చాటింగ్ లు, పోన్ సంభాషణలు జరుగుతున్నాయని సమాచారం. ఈ విషయంపై భార్య కారం స్వప్న, భర్త సాయికుమార్ ను గట్టిగా నిలదీయడంతో భార్య, భర్తల మధ్య తగాదా జరిగింది. ఈ ఘటన వల్లనే కారం స్వప్న తట్టుకోలేక ఉరి వేసుకుంది. భార్య చనిపోయందనే భయంతో భర్త సాయి కుమార్ పురుగు మందు సేవించి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement