అభివృద్ధిలో కేసీఆర్ ఆదర్శంగా ఉంటే.. తిట్లలో రేవంత్ రెడ్డి ఆదర్శంగా ఉన్నారని చెప్పారు మాజీ మంత్రి హరీశ్ రావు. సిద్ధిపేటలో ఇవాళ జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ఆయన మాట్లాడుతూ… ఆరు గ్యారంటీలు అమలు చేస్తే రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. తనకు పదవులు ముఖ్యం కాదని, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. నాడు ఓటుకు నోటులో దొరికిన రేవంత్ రెడ్డి నేడు ఓటుకు ఒట్టు అంటున్నారని విమర్శించారు. హామీలు అమలయ్యే వరకు పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని చెప్పారు. తమ పథకాలను బీజేపీ కాపీ కొట్టిందని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు, రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే తాను స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా ఇస్తా అన్నారు. మీ దగ్గర సరుకు లేకే తనను తిడుతున్నారని కాంగ్రెస్ నేతలను ఎద్దేవా చేశారు.. తాజాగా జిల్లాలు ఎక్కువ అయ్యాయని వాటిని తక్కువ చేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని తెలిపారు.