Tuesday, November 26, 2024

Breaking: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల..

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. 42పేజీలతో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పులు 6,71,757కోట్లు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి రూ.72,658కోట్లు ఉందని తెలిపింది. పదేళ్లలో సగటున 24.5శాతం రుణం పెరిగింది. 2023-24 అంచనాల ప్రకారం రుణం 3,89,673కోట్లు ఉందని తెలిపింది.

2015-16లో రుణ, జీఎస్ డీపీ 15.7శాతం, రెవెన్యూ రాబడిలో రుణాల చెల్లింపు భారం 34శాతం, రెవెన్యూ రాబడిలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు 35శాతం ఉందని ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement