Tuesday, November 26, 2024

Khammam : వరద ప్రభావిత ప్రాంతాల్లో విప్ రేగా పర్యటన… నిర్వాసితులకు పరామర్శ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పరిధిలోని ఆళ్లపల్లి మండలంలోని రాయపాడు, ముత్తాపురం, ఆనంతోగు, ఆళ్ళపల్లి, మార్కోడుతో పాటుగా పలు గ్రామాల్లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పర్యటించారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న బీటి రోడ్లను పరిశీలించి, ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడి రోడ్డు మరమ్మత్తుల పనులను పూర్తయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. తాత్కాలికంగా జరుగుతున్న పనులను పరిశీలించి, సంబంధిత అధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. వర్షాల కారణంగా దెబ్బతిని నష్టపోయిన ఇండ్లను, పంటలను, వంతెనలను పరిశీలించారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ నుంచి పరిహారం అందేలా కృషి చేస్తాను అన్నారు. పలు గ్రామాల్లో ఇండ్లలోకి చేరిన నీళ్లను, శిథిలావస్థలోకి చేరిన గృహాలను, వీధి రోడ్లను పరిశీలించారు.

నిర్వాసితులకు అధికారులు కల్పిస్తున్న సదుపాయాలు నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆళ్లపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో 17 మందికి ప్రభుత్వం అందిస్తున్న 1లక్షా వెయ్యి116 రూపాయలు కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈకార్యక్రమంలో జెడ్పిటిసి హనుమంతరావు, ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి, అధ్యక్షులు నరసింహారావు, ప్రధాన కార్యదర్శి బాబా, కోపరేట్ సొసైటీ చైర్మన్ రామయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షులు రాంబాబు, సర్పంచులు ఈశ్వరి, ప్రేమకల, శంకర్ బాబు నియోజకవర్గం కార్యదర్శి ఆరీప్, డైరెక్టర్ ఆఫీస్, సాంబశివరావు, ఆత్మ కమిటీ చైర్మన్ లక్ష్మయ్య, గిరిజన మండల అధ్యక్షులు లక్ష్మయ్య, పూనెం కృష్ణ. అంజిత్, ఆర్డిఓ శిరీష, తాసిల్దార్ మహమ్మద్ సాదియా సుల్తానా, ఎంపీఓ శ్రీనివాసరావు, ప్రత్యేక అధికారి వెంకటేశ్వరరావు, ఆర్అండ్ బీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement