Friday, November 22, 2024

TS: ఫిట్ నెస్ లేని వాహనాలపై కొరడా.. తొలిరోజే 40 బస్సులు సీజ్..

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కొనసాగిన తనిఖీలు…
ఫిట్ నెస్ చేయించుకోకపోతే చర్యలు… డీటీసీ చంద్రశేఖర్ గౌడ్…

(ప్రభ న్యూస్ ఉమ్మడి రంగారెడ్డి బ్యూరో) : ఫిట్ నెస్ చేయించుకోని వాహనాలపై రవాణా శాఖ కొరడా ఝులిపిస్తోంది. సెలవు రోజుల్లో బస్సులకు ఫిట్ నెస్ చేయించుకోవాల్సి ఉండగా.. చాలామంది ఫిట్ నెస్ చేయించుకోలేదు. దీంతో మొదటి రోజు నుంచే రవాణా శాఖ తనిఖీలకు శ్రీకారం చుట్టింది. మొదటి రోజు బుధవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 40బస్సులను సీజ్ చేసారు.

రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ ఆదేశాల మేరకే రవాణా శాఖ అధికారులు తనిఖీలకు శ్రీకారం చుట్టారు. శివారు ప్రాంతాల్లో స్కూల్, కాలేజీ బస్సులను తనిఖీలు నిర్వహించారు. బస్సుల్లో కనీస సౌకర్యాలు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. ఫిట్ నెస్ లేని బస్సులు రోడ్ల పైకి వస్తే వదిలి పెట్టేది లేదని డీ టీ సీ చంద్రశేఖర్ గౌడ్ హెచ్చరించారు. యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement