గన్నేరువరం, (ప్రభన్యూస్ ): కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో ఘోరం జరిగింది. మైలారం గ్రామానికి చెందిన మడికంటి మల్లేశం (45) శనివారం ఇంట్లో సెల్ ఫోన్ కు చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతుండగా కరెంట్ షాక్ కొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సమాచారం అందడంతో ఎస్సై మామిడాల సురేందర్ అక్కడికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. దీనిపై తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
చార్జింగ్పెట్టి ఫోన్ మాట్లాడుతుంటే షాక్ కొట్టింది.. మనిషిని చంపేసిన ఫోన్, కరీంనగర్ జిల్లాలో ఘటన
Advertisement
తాజా వార్తలు
Advertisement