Saturday, November 23, 2024

Breaking: వాగు దాటుతుంటే కొట్టుకుపోయిన కారు.. చాక‌చ‌క్యంగా త‌ప్పించుకున్న‌ భార్య భర్తలు

ధరూర్, (ప్రభ న్యూస్): వాగులో కారు కొట్టుకుపోయిన ఘ‌ట‌న వికారాబాద్ జిల్లాలో జ‌రిగింది. దోర్నాల గ్రామానికి చెందిన ఇద్దరు భార్యాభర్తలు కారులో బయలుదేరి వికారాబాద్ వెళుతుండగా ఈ ఘ‌ట‌న ఇవ్వాల ఉద‌యం (గురువారం) జ‌రిగింది. దేవనూరు శివ, ఆయ‌న‌ భార్య మౌనిక నాగారం సమీపంలోని వాగు దాటుతుండగా నీటి ఉధృతికి కారు నీటిలో కొట్టుకుపోయింది. కారు నీటిలో కొట్టుకుపోతుండగా వారు చాక‌చ‌క్యంగా కారులో నుంచి బయట‌ప‌డ్డారు. చెట్లను ఆస‌రాగా చేసుకుని గ‌ట్టుకు చేరుకున్నారు. ఇతరుల సహాయం కోరారు. నాగారం గ్రామానికి చెందిన కొందరు తాళ్ల సాయంతో వారిని బయటికి తీసుకొచ్చారు.

దసరాకు పండుగకు సొంత గ్రామమైన దోర్నాల గ్రామానికి శివ‌, మౌనిక వ‌చ్చారు. పండుగ చేసుకొని గురువారం ఉదయం తెల్లవారుజామున తిరిగి వెళుతుండగా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అయితే.. నిన్న‌ రాత్రి కురిసిన భారీబ‌వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో నాగారం సమీపన ఉన్న‌ వాగు ఉధృతంగా ప్రవహించడంతో కారు నీటిలో కొట్టుకొని పోయింది. దెవనూర్ శివ, ఆయ‌న భార్య మౌనిక ఇద్దరు కారులో నుంచి త‌ప్పించుకుని బ‌య‌ట‌ప‌డ్డారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement