ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి మెదక్: ప్రతి పండుగను ఆనందంగా జరుపుకోవటం మన సంప్రదాయమని, నియోజకవర్గ ప్రజలంతా సంతోషంగా జీవించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ , సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో జగ్గారెడ్డితో పాటు గాయని మంగ్లీ పాల్గొన్నారు.
రామమందిరం నుంచి భక్తి శ్రద్ధలతో, ఆట, పాటలతో రావణ శవయాత్ర.. రామలక్ష్మనుల వేషధారణలు నిర్వహించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఏర్పటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమలు అలరించాయి. ప్రముఖ గాయకురాలు మంగ్లీ పాడిన పాటలు యువతను హోరెత్తించాయి. అనంతరం ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రజల సంతోషం కోసం చెక్కులిచ్చి దసరా ఉత్సవాన్ని చేస్తున్నన్నారు. తాను ఏ పని చేపట్టిన నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే చేస్తానన్నారు. ప్రజల సంక్షేమాన్ని ఎప్పుడు మారువనని అన్నారు. అందుకే ఈ విజయదశమి ఉత్సవాల హామీ ఇస్తున్నానని సంగారెడ్డి, సదాశివపేట,కొండాపూర్, కంది మండలల్లో ప్రజల కు ప్రతి ఇంటిలో ఒక్కరి కి 125 గజాల ఇంటి స్థలం ఇప్పిస్తానన్నారు.
మాట ఇస్తే నెరవేర్చే వరకు విశ్రమించడని.. ఇది ఇక్కడి ప్రకలకు తెలుసునన్నారు జగ్గారెడ్డి. అధికార ప్రభుత్వం పై విమర్శలు చేయనని, తెలివితో నియోజకవర్గ సమస్యలు పరిష్కరించేందుకు శాయశక్తులా కృషిచేస్తానన్నారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజి, కందిలో ఐఐటి, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటులో తన కృషి ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి, జాయరెడ్డి, తోపాజి అనంత కిషన్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.