Tuesday, January 7, 2025

Missing : ఆ ఇద్ద‌రు బాలిక‌లు ఎక్క‌డ‌.. నిజామాబాద్ లో మిస్సింగ్ క‌ల‌క‌లం

నవీపేట్, జనవరి 3 (ఆంధ్రప్రభ) : నవీపేట్ మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు పదో తరగతి విద్యార్థినిలు కొండపల్లి శిరీష, మేడం వరలక్ష్మి, గడ్డం రవళికలు గురువారం అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మండల కేంద్రంలోని సుభాష్ నగర్ కు చెందిన కొండపల్లి శిరీష, లింగమయ్య గుట్టకు చెందిన గడ్డం రవళిక, హనుమాన్ ఫారం గ్రామానికి చెందిన వరలక్ష్మిలు ఇంటి నుండి స్కూల్ కు వెళ్తామని బయలుదేరి అదృశ్యమ‌య్యారు.

పాఠశాల ఉపాధ్యాయుల సమాచారం మేరకు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో రాత్రి 11గంటలకు పోలీసులను ఆశ్రయించారు. ఎస్సె వినయ్ కుమార్ పూర్తి వివరాలు తెలుసుకొని ఆచూకీ కోసం గాలింపు చేపట్టగా, నిజామాబాద్ బస్టాండ్ లో వేకువజామున 3 గంటలకు శిరీష లభ్యం కాగా, మిగతా వారికోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement