ప్రభన్యూస్: పాఠశాలల్లో టీచర్ ఉద్యోగం పొందాలంటే ముందుగా వారు టెట్ (టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్)లో అర్హత సాధించాలి. దీనికోసం రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు టెట్ ఎప్పుడు నిర్వహిస్తారో అని నిరీక్షిస్తున్నారు. ఆరు నెలలకు ఒకసారి నిర్వహించాల్సిన టెట్ పరీక్షను నాలుగేళ్లు అవుతు న్నా అధికారులు దాని ఊసే ఎత్తడంలేదు. దీని గురించి ఏమైనా వివరణ కోరితే ఆ అంశం తమ పరిధిలో లేదని విద్యాశాఖ అధికారులు దాటవేస్తున్న పరిస్థితి. మరో వైపు టెట్ నోటిఫికేషన్ వేస్తారని నిరుద్యోగ అభ్యర్థులు కొంతకాలంగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రెండు సార్లు మాత్రమే టెట్ నిర్వహించారు. 2016 మే 22న ఒకసారి కాగా, 2017 జూలై 23న రెండోసారి టెట్ నిర్వహించారు.
ఆ తర్వాత నుంచి టెట్ నిర్వహణను పట్టించుకోవడంలేదు. టీచర్ పోస్టుల భర్తీ ఎలాగో లేదు. కనీసం ప్రైవేట్ స్కూళ్లలోనైనా చదువు చెప్పుదామనుకుంటే టెట్ లేకపోవడంతో ఆ అవకాశం లేకుండా పోయిందంటున్నారు. పాఠశాల విద్యాశాఖలో క్యాడర్ స్ట్రెంత్ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. స్కూళ్ల వారీగా, మేనేజ్‌మెంట్ల వారీగా ఉపాధ్యాయుల ఖాళీల వివరాలను సేకరించారు. దీనికి సంబంధిచిన దస్త్రాన్ని నేడో, రేపో ప్రభుత్వానికి అధికారులు సమర్పించ నున్నారు. ఈ పోస్టుల భర్తీకి ముందే టెట్‌ను నిర్వహించాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital