Saturday, November 23, 2024

18 ఏళ్లకే ప్ర‌ధానిని ఎన్నుకున్న‌ప్పుడు.. పెళ్లెందుకు చేసుకోవ‌ద్దు: ఒవైసీ

ఆడాళ్ల పెళ్లి వ‌యస్సును 21 ఏండ్ల‌కు పెంచుతూ కేంద్ర తీసుకున్న నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌ట్టారు ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ. ప్ర‌ధాన‌మంత్రిని ఎన్నుకునే వ‌య‌స్సున్న 18ఏండ్ల యువ‌తులు పెండ్లి చేసుకోవ‌డంలో అభ్యంత‌రం ఏమిట‌ని ప్ర‌శ్నించారు ఒవైసీ. కాగా, మహిళ‌ల‌ వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శీతాకాలంలో జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంటు సమావేశాల్లో మహిళ‌ల‌ వివాహ వయసు పెంచేదుకు సవరణ బిల్లును కేంద్రం తీసుకురానుంద‌ని స‌మాచారం. దీంతో దేశ వ్యాప్తంగా అమ్మాయిల పెళ్లి వయసుపై చర్చ మొదలైంది. ఈ నేప‌థ్యంలో AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మోడీ నాయ‌క‌త్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని విమ‌ర్శిస్తూ అభ్యంతరం వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement