ఆదిలాబాద్ సభలో బీజేపీ ముఖ్యనేత అమిత్ షా చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అబద్ధాల అమిత్ షా పార్టీకి తెలంగాణలో గుణపాఠం తప్పదన్నారు. ఆయన తన ప్రసంగంలో నిజాలేమీ చెప్పలేదని, అన్నీ అసత్యపు ప్రచారాలేనని మండిపడ్డారు. అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ ఎన్ని అబద్ధాలు చెప్పినా తెలంగాణ ప్రజలు వారిని తిరస్కరించక తప్పదన్నారు. బీజేపీకి మరోసారి 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయం అన్నారు కేటీఆర్..
ఇక.. పరివార్ వాద్ అంటూ అమిత్ షా మాట్లాడితే ప్రజలు వారిని వెక్కిరిస్తున్నారని, బీసీసీఐ పదవిలో ఉన్న అమిత్ షా తనయుడు క్రికెట్ ఎప్పుడు ఆడారో దేశ ప్రజలకు చెప్పాలన్నారు. ప్రజాశీర్వాదంతో గెలుస్తున్న పార్టీలను, నేతలను ప్రశ్నించే నైతిక హక్కు అమిత్ షాకు లేదన్నారు. పదేళ్లలో తెలంగాణకు ఒక్క విద్యాసంస్థనూ ఇవ్వలేదని కేంద్రంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు.