Friday, November 22, 2024

పెన్ డ్రైవ్ తో ఏం చేసుకోవాలి-ఏజీని ప్ర‌శ్నించిన హైకోర్టు న్యాయ‌మూర్తి

త‌న పాద‌యాత్ర‌లో బిజెపి తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేస్తున్నార‌ని ఆరోపించిన ఏజీ.. రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాలు బండి సంజ‌య్ ప్ర‌సంగాల‌కు చెందిన వీడియోల‌ను పెన్ డ్రైవ్‌లో కోర్టుకు అంద‌జేశారు. ఏజీ అంద‌జేసిన పెన్ డ్రైవ్‌ను త‌దేకంగా ప‌రిశీలించిన హైకోర్టు న్యాయ‌మూర్తి…పెన్ డ్రైవ్‌తో ఏం చేసుకోవాల‌ని ఏజీని ప్ర‌శ్నించారు. కోర్టుకు స‌మ‌ర్పించే ఆధారాలు ఏ రూపంలో ఉండాలో మీకు తెలియ‌దా? అంటూ ఏజీని నిల‌దీసిన న్యాయ‌మూర్తి… డాక్యుమెంట్ల స‌మ‌ర్ఫ‌ణ‌లోనూ నిబంధ‌న‌లు పాటించ‌కుంటే ఎలాగ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా వీడియోల‌ను స‌మర్పించాల్సి రావ‌డంతోనే పెన్ డ్రైవ్‌లో ఇవ్వాల్సి వ‌చ్చింద‌న్న ఏజీ… సాఫ్ట్ కాపీల్లో ఆ వీడియోల‌ను అంద‌జేస్తామ‌ని చెప్ప‌డంతో న్యాయ‌మూర్తి శాంతించారు. బండి సంజ‌య్ పాద‌యాత్ర నిలుపుద‌ల‌, పున‌రుద్ధ‌ర‌ణ కోసం బీజేపీ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై తెలంగాణ హైకోర్టు గురువారం విచార‌ణ చేప‌ట్టింది. ఈ విచార‌ణ సంద‌ర్భంగా ఈ ఆసక్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. కోర్టు విచార‌ణ‌కు పాద‌యాత్ర‌ను నిలుపుద‌ల చేసిన వ‌ర్ధ‌న్న‌పేట ఏసీపీతో పాటు తెలంగాణ పోలీసు శాఖ త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించేందుకు అడ్వొకేట్ (ఏజీ) జ‌న‌ర‌ల్ బీఎస్ ప్ర‌సాద్ హాజ‌ర‌య్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement