సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇవ్వాల (సోమవారం) ప్రజావాణి కార్యక్రమంలో ఉన్న అధికారులు ఇచ్చే సమాధానాల తీరుపై జేసీ చంద్రశేఖర్ అసహనం వ్యక్తం చేశారు. చివరకు మీరంతా ఎవరు మీ డిజిగ్నేషన్ ఏంటిది. జిల్లా అధికారులు రావాలంటే జూనియర్ అసిస్టెంట్లు సీనియర్ అసిస్టెంట్లు మండల ఆఫీసర్లు వస్తే సమస్యలు తీరుతాయా.. రాణి వారంతా కలెక్టర్ గారి అనుమతి తీసుకున్నారా అని అధికారుల తీరుపై జేసీ చంద్రశేఖర్ మండిపడ్డారు.
ప్రజావాణిలో ఉన్నటువంటి అధికారులు అందరినీ లెక్కించి మరి జూనియర్ అసిస్టెంట్లు ఎందరు సీనియర్ అసిస్టెంట్ ఎందరు మండలాధికారులు ఎందరు జిల్లా అధికారులు ఎందరు అని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. గత నాలుగైదు సోమవారం జరిగే ప్రజావాణి తీరును గమనించి ఈ రోజు ఇలా ప్రశ్నించడం జరిగింది.. ఇలా అయితే ప్రజా సమస్యలు ఎలా తీరుతాయి. ఇదేనా మీరు ప్రజలకు ఇచ్చే జవాబు దారి తనం అని ప్రజావాణి మైక్ లోనే అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
సమస్యలతో వచ్చే ప్రజలకు జవాబుదనం చెప్పడానికి క్లర్కులు సీనియర్ అసిస్టెంట్లు సబ్జెక్టు ఉండదు, నాలెడ్జ్ ఉండదు, దానికి సంబంధిత విషయావగాహన ఉండదు, ఏదైనా అడిగితే సార్లు కనుక్కొని చెప్తాను అని అంటారు. వారికి తెలవనప్పుడు ప్రజలకు ఏం సమాధానం ఇస్తారని ప్రజావాణికి హాజరైన అధికారులపై విరుచుకుపడ్డారు. జిల్లా అధికారులు నా పని చేస్తే, ఏం అసోసియేషన్ ఇది జిల్లా అధికారుల ది అని డిపిఓ సురేష్ మోహన్ ను అడిగారు.
మీరు ఇక్కడికి వచ్చి ఏం లాభం ఇక్కడకు వచ్చి ఒకరినొకరు మాట్లాడుకోవడానికా వచ్చింది. ఇప్పటికే రెండు మూడుసార్లు జిల్లా అధికారులకు చెప్పిన ఇంపార్టెంట్ ఉంటే అనుమతి తీసుకుని వెళ్లాలి లేదా కోర్టు కేసులు ఉంటే వెళ్లాలని చెప్పాము కానీ అంతకంటే ఇంకా ఇంపార్టెంట్ ఏం వర్క్ ఉంటది ప్రజావాణి కి రాకుండా ఉంటే ప్రజల సమస్యలు ఎలా తీరుతాయి అన్నారు.