నిజామాబాద్, ప్రతినిధి మే 11(ప్రభ న్యూస్) : రద్దయిన ఉగ్రవాద సంస్థలు, ఆర్గనైజేషన్లు… బహిరంగంగా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం ఏమిటని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే టెర్రరిస్టులు రాజ్యమేలుతారని… ప్రజల్లో మార్పు రావాలని ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో నిర్వ హించిన మీట్ ద ప్రెస్ లో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ…. అసలు దేశం ఎటుపోతుందని… దేశ భద్రతపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ప్రజలకు సమాధానం చెప్పి తర్వాతనే ఓట్లు అడగాలని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కల్యాణ లక్ష్మి, మహాలక్ష్మి, పింఛన్ల పెంపు, రైతులకు బోనస్ తదితర ఫ్రీ హామీలిచ్చి ప్రజలను రేవంత్ సర్కార్ మోసం చేసింది.. వారి ఉసురు తగిలి త్వరలోనే రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోతదన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునే ఎన్నికలివనీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఎన్నికలు వస్తూ ఉంటాయి.. పోతూ ఉంటాయి కానీ ఇవి నరేంద్ర మోడీ ఎన్నికలు అని చెప్పారు.
దేశ భవిష్యత్తు సురక్షితంగా, భద్రతంగా ఉండాలంటే ఈ ఎన్నిక చాలా ముఖ్యమైనదన్నారు. రాంమందిర్ తమ పార్టీ మేనిఫెస్టోలో ఎప్పటి నుంచో ఉంది.. న్యాయపరంగా కొట్లాడి సాదించుకొని గుడి కట్టుకున్నాం.. రాముడి పేరు చెబితే కడుపు నిండుతదా అని కేటీఆర్ వ్యాఖ్యలపై ఖచ్చితంగా మాకు కడుపు నిండుతదన్నారు. ముస్లింలు, హిందువులు అనే తేడా లేకుండా అందరికీ సమానంగా మోదీ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి ప్రత్యేకంగా కృషి చేస్తుందన్నారు. రాజ్యాంగంలో అమెండ్‌మెంట్స్ కొత్తేమీ కాదు.. కాంగ్రెస్ పార్టీ అమెండ్‌మెంట్స్ ఎక్కువ సార్లు చేసింది.. కాంగ్రెస్ సెక్యులర్ పదం ఎట్లా చేరుస్తదని నేను ప్రశ్నించాను.. దీనిని కొందరు రాజకీయం చేస్తున్నారు.. బీడీ పరిశ్రమకు ప్రత్యామ్నాయంగా మోదీ ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పిస్తూ చర్యలు చేపడుతుందన్నారు. రేవంత్ హిందువులకు సూక్తులు చెప్పడం బంద్ చేయాలన్నారు. మహిళలు ఎన్నికల్లో ముఖం కనిపించకుండా ఓటు వేయడాన్ని అనుమతించవద్దు..ఈ విషయమై ఈసికి లేఖ రాశాను.. దీనిపై ఈసీ సీరియస్ గా దృష్టి పెట్టాలనీ కోరారు. మోడీతోనే ప్రజా సంక్షేమమని ఎంపీ అరవింద్ చెప్పారు.